మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళి

0

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళి

భువనగిరి, ఆర్ పి న్యూస్:

భారతదేశ మాజీ ప్రధాని,ఆర్థికవేత్త, దేశాభివృద్ధికి ఎనలేని తోడ్పాటును అందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్* మృతి సందర్భంగా ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ చౌరస్తా వద్ద నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాడు అని కొనియాడారు అంతేకాకుండా వలసలను నివారించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చాడు మరియు సమాచార హక్కు చట్టం అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాశం శివానంద్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ అవెస్ చిస్తీ, బ్లాక్ అధ్యక్షులు వెంకటేష్,మాజీ సర్పంచ్లు నానం కృష్ణ,జీలుగు సతీష్ పవన్,తంగెలిపల్లి శ్రీనివాస్, కనుకుంట్ల బాబురావు, పకీర్ కొండల్ రెడ్డి, కోట మహేందర్, చుక్క స్వామి బొల్లేపల్లి అశోక్, మంగ ప్రవీణ్,కనుకుంట్ల కొండల్,బింగి భిక్షపతి,లుర్దు,మహేష్, కాంగ్రెస్ కార్యకర్తలు,గ్రామ శాఖ అధ్యక్షులు,మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *