హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ కార్మికులకు ఉపాధి

0

హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ కార్మికులకు ఉపాధి

– సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, ఆర్ పీ న్యూస్ :

హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు.పోలీస్, ఆర్టీసీ, ఆరోగ్య తదితర విభాగాలు ప్రభుత్వ సంస్థల నుంచి క్లాత్‌ను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.రేవంత్ రెడ్డి మంత్రుల తో సమావేశాన్ని నిర్వహించారు.హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌లో నిజమైన కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని విభాగాల్లో యూనిఫామ్‌ల కోసం క్లాత్ సేకరించే వారితో ఆగస్టు 15 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు.మహిళా శక్తి గ్రూపు సభ్యులకు అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన డ్రెస్‌ కోడ్‌ కోసం ప్రత్యేక డిజైన్‌ రూపొందించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీపై చేపడుతున్న కార్యక్రమాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఎండీ శైలజ రామయ్యర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *