దొడ్డి కొమురయ్య అమరత్వం 

0

 

       దొడ్డి కొమురయ్య అమరత్వం 

          గోలి.కృష్ణ. ~ 944179645

1946 జులై 4 విస్నూర్ దేశముఖ్ గుండా
తుపాకీ కాల్పుల్లో తెలంగాణా ప్రజల,
రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు
దొడ్డి కోమరయ్యకు ముందుగా విప్లవ
జోహార్లు అర్పిస్తున్నాం. ఈ సందర్బంగా
దేశంలో దొడ్డి కోమరయ్య అమరత్వానికి,
దాని కొనసాగింపునుకు ఉన్న విప్లవ
ప్రాధాన్యతను పరిశీలించూదాం.

తెలంగాణా నాలుగు వైపులా చూస్తే –
భారతావనిలో వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లే
పారే నదులు, కొండల వరుసలు, దట్టమైన
అడవులు, సారవంతమైన మైదాన
ప్రాంతాలు, సూదరమైన ప్రకృతి దృశ్యాలు
కనిపిస్తాయి. ఏ రోజు అనక కష్టించి పనిచేసే
ప్రజలు, వారి సరసనే నివసిస్తూ బోగ
భాగ్యాలనుభవించే సంపన్నులు కనిపిస్తారు.
శిదిలమైపోతున్న పాతకాలపు కోటలు,
అపూర్వమైన శిల్ప సంపదకలిగిన
దేవాలయాలున్నాయి. వేల ఎకరాలను
మాగాణిగా మార్చిన పెద్ద, పెద్ద చెర్వులు
న్నాయి. ప్రాచీన చరిత్రను చాటిచెప్పగల,
గ్రామాలు, పట్టణాలు ఎన్నో ఈ భూమిలో
దాగి ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో కూడా
ఇవ్వన్నీ ఉంటే తెలంగాణకుగల ప్రత్యేకత
ఏమిటీ ?

ఈ ప్రశ్నకు సమాధానం:1946 నుండి 1951
వరకు సాగిన ప్రజల, రైతాంగ సాయుధ
పోరాటమే తెలంగాణాకు ఆ ప్రత్యేకతను
సంతరించి పెట్టింది. తెలంగాణా సాయుధ
పోరాటానీకున్న వాస్తవమైన ప్రత్యేకత
ఏమంటే ! ఇచ్చట భావిభారత విప్లవపంథాకు
సంబంధించిన ప్రయోగం ( Experiment )
జయప్రదమైంది. ఈ ప్రయోగాన్ని ఆధారం
చేసుకొని కమ్యూనిస్టు విప్లవ కారులు భారత
విప్లవ పంథాను రూపొందించారు. ఈ పంథా
విప్లవ కారులది మాత్రమే కాదు. భారత
ప్రజలందరికీ సంబంధించినది. ఈ కారణం
వల్లనే దీని ప్రాధాన్యత కూడా ప్రత్యేకత ఉంది.
( తెలంగాణా ప్రజాల సాయుధ పోరాట చరిత్ర
కామ్రేడ్ డి.వి )

ప్రపంచ సాయుధ పోరాటాల చరిత్రలో సముచిత స్థానం సంపాదించి, ప్రత్యేకతను
సంతరించుకున్న ఆ పోరాట వారసులుగా,
ఉభయ కమ్యూనిస్టులు , మతవాద
తిరోగమన జాతీయ దూరహంకార పార్టీ,
తెలంగాణా కాంగ్రెసు ప్రబుత్వ నాయకులు,
మొదలైన పాలక పార్టీలు ఎవ్వరి స్థాయిలో
వారు తమ ఎన్నికల రాజకీయ అవసరాల
కోసం ఉపోయోగించు కుంటున్న పరిస్థిని చూస్తున్నాం.

తెలంగాణా సాయుధ పోరాట కాలంలో ఆరెస్సెస్ ఆనాటి జనసంఘ్ కాగడతో
వేదికినా ఎక్కడ కనిపించదు. సంస్థానంలో హిందూ భూస్వాములె ప్రజల పట్ల క్రూరంగా
వ్యవహరించి ఫ్యూడల్ దౌర్జన్యాలు జరి
పింది. వాటికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు
ఆంద్రమహాసభ ద్వారా ప్రజలను సంఘటిత
పర్చి సాయుధ పోరాటానికి సిద్ధం చేసింది.
మతోన్మాద బిజెపి ఆ పోరాటం హిందూ,
ముస్లింలకు మద్యజరిగిన పోరాటంగా
చరిత్ర వక్రీకరణకు పాలు పడుతుంది.
తెలంగాణాలో సెప్టెంబర్ 17 ను ప్రభుత్వ
అధికార దినోత్సవంగా జరపాలని డిమాండ్
చేస్తూ తమ ముస్లిం వ్యతిరేక మతోన్మాదా
రెచ్చగొట్టి, మెజారిటీ హిందూ ప్రజలను
తమ ఓటుబ్యాంక్ గా మార్చుకొనే కుఠిల
రాజకీయనీతిలో అంతర్భాగంగమనే
అంశం హిందూ ప్రజలు గమనించాలి.

ఉభయ కమ్యూనిస్టులలో సిపిఐ నాయక
త్వం సాయుధ పోరాటం నిజాం రాజుకు వ్యతిరేకంగా మాత్రమే సాగిందని, 1948 సెప్టెంబర్ 17 న నెహ్రు సైన్యాలకు నిజాం లొంగిపోయి తరువాత పోరాటం కొనసాగించడం ఆత్మహత్య సదృష్యంగా భావించి విరమించాలనే డిమాండ్ చేసింది.

సిపియం పార్టీ సాయుధ పోరాటంలో
సాధించిన విప్లవ విజయాలను పరిరక్షణ
కోసం కొనసాగించాలని, ఆక్రమంలోనే నెహ్రు అభ్యుదయ విధనాల మీద భ్రమలు కలిగిన
కేంద్ర కమిటీ నాయకత్వం, ప్రభుత్వంతో
చర్చలు జరిపి గౌరవప్రదమైన, మెరుగైన ఫలితాలు రాబట్టాలని ఆ చర్చలు జరుప
కుండానే సాయుధ పోరాట విరమణ
ప్రకటన 1951 అక్టోబర్ లో చేసింది.

పోరాట విరమణ వాదంలో ఇరుపార్టీల
వాదనలో భిన్నత్వం కనిపించి నప్పటికీ,
అంతిమంగా ఇరువురు విద్రోహనికి పాలు
పడి చరిత్రాత్మకమైన సాయుధ పోరాటాన్ని
విరమింప చేసిన సందర్భం చరిత్రలో
నిక్షిప్తమై ఉన్నది. ఇరు పార్టీల మధ్య పార్ల
మెంట్ రాజకీయపంథా చేపట్టడంలో మౌలిక రాజకీయ విభేదాలు ఏమిలేవు. వారిమధ్య
ఐక్యత ప్రధానం, విభేదాలు అప్రదానం.
సంప్రదాయంగా వస్తున్న గత ప్రజాపునాధిని కాపాడుకొనేలక్ష్యం, ఎన్నికల ప్రయోజనాల కోసం తమకు తాముగా తెలంగాణా
సాయుధ పోరాట వారసులుగా ప్రకటించు కుంటున్నారు.

దేశంలో వివిధ యం.యల్. గ్రూపుల వారు
అదొక వీరోచిత పోరాటమని ఒక నమస్కార
బాణం వేసి, ఆ పోరాట విప్లవానుభవాలను
స్వీకరించడానికి నిరాకరిస్తున్నారు. అర్ధవలస,
అర్ధఫ్యూడల్ వ్యవసాయక దేశమైన మన
దేశంలో వ్యవసాయక విప్లవోద్యమ నిర్మాణ
ప్రాధాన్యతను గుర్తించకుండా, మాటల్లో
వ్యవసాయక విప్లవోద్యమాన్ని అంగీకరించ
డం, ఆచరణలో అనేక తప్పుడు సిద్ధాంత
రాజకీయ కార్యచరణ అమలు జరపడ.
పలితంగా దేశంలో ఈ నాటివరకు సరైన
విప్లవ పునాదులమీద వ్యవసాయక
విప్లవోద్యమ నిర్మాణం జరుగలేదు.

దోపిడీ పాలక వర్గాల ఫాసిస్టు నిర్బంధ
చర్యల పలితంగా విప్లవోద్యమ నిర్మాణానికి,
పురోగమనానికి తీవ్రవిఘాతం కలుగుతుంది. దేశంలో లెక్కకు మించి యం.యల్ గ్రూపులు ఏర్పడటానికి, చీలికలకు దోపిడీ పాలక వర్గాల ప్రోత్సహం,.సామ్రాజ్యవాద శక్తుల ప్రమేయం ప్రబలంగాఉన్నది. యం.యల్. గ్రూపులలో మెజారిటీ వారిని,వారి ఆలోచనలను, నడిపిస్తున్నది విప్లవ రాజకీయాలు ఎంత మాత్రంకావు. అవకాశవాదం, ఆర్ధిక అరాచక ముఠా, అనైతిక రాజకీయాల అనడంలో ఎలాంటి అతిశయోక్తులు లేవు. ఇవి రోజు,
రోజుకు బయటపడుతున్న బహిరంగ
రహస్యాలు.

కామ్రేడ్ డి.వి. తెలంగాణా సాయుధ పోరా
టానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన
కమ్యూనిస్టు విప్లవకారుల నాయకులు.
భావితరాల భారత విప్లవవానికి మార్గం
చూపిన సాయుధ పోరాటమని బలమైన
అభిప్రాయం కలిగిన నాయకులు. ఆ అనుభవాలతోనే ఈ దేశంలోని నిర్దిష్ట
పరిస్థితులకు మార్క్సిజం – లెనినిజం,
మావో ఆలోచనా సిద్ధాంతానికి భారతీయ
వ్యాఖ్యానం ( Interpition ) చేసి విప్లవ
ప్రజా పంథాను రూపొంచినారు.

మార్క్సిజం – లెనినిజం, మావో ఆలోచనా విధానం, ఆ సిద్దాంత యొక్క ప్రాపంచిక
దృక్పధంతో తెలంగాణా సాయుధ పోరాట విప్లవానుభావాల మీద ఆధారపడి పంథాను
రూపొందించిననారు. విప్లవ ప్రజాపంథాను
కామ్రేడ్ టి.యన్. ఎలాంటి సందిగ్దలకు
తావులేకుండా త్రికరణ శుద్దిగా అంగీకరించి,
అంగీకరించడమే కాదు ఈ విప్లవ పంథాను అతివాద, మితవాద దాడుల నుండి
పరిరక్షించి నిలబెట్టినారు. దీన్నిని పునాధిగా చేసుకొని దేశ వ్యాపితంగా విప్లవ కారులను ఐక్యం చేసే కార్యక్రమంలో నిమగ్నమై జులై
మాసంలోనే అమరులైనారు.ఈ ఇరువురు నాయకులు భారత దేశంలో దళారి బడా భూర్జువా, అర్దఫ్యూడల్ భూస్వామ్య, నిరంకుషాధికార దోపిడీవర్గాల పాలనను కులద్రోసి, కార్మికవర్గనాయకత్వంలో జనతా ప్రజాతంత్రవిప్లవ కర్తవ్యాలను పరిపూర్తి చేయాలని,అందుకు దేశంలో వ్యవసాయక విప్లవోద్యమ

నిర్మాణానికి తమ జీవిత అంతిమ దశకు కృషిచేసినారు. ఆ క్రమంలోనే కామ్రేడ్ డి.వి. కూడా జులై మాసంలోనే అమరులైనారు.దేశంలో మార్క్సిజం -.లెనినిజం పేరుతో కొనసాగతున్న బలమైన సంస్కరణవాదం, రివిజనిజం, మావో ఆలోచనా సిద్ధాంతంపేరుతో అతివాద, అవకాశవాదం,పిడివాదం బలంగా కొనసాగుతూ ఉన్నాయి.అదేసమయంలో కుల, అస్తిత్వ ప్రాంతీయ

వాద ఉద్యమాలకు పాలక వర్గాల ప్రోత్సహం,
సామ్రాజ్యవాద శక్తుల మద్దతు లభిస్తుంది.
దీంతో దేశంలో చీలిక ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. పలితంగా విప్లవోద్యమ నిర్మాణా
నికి, పురోగమనానికి తీవ్ర ప్రతికూల
పరిస్థితులు ఏర్పడినాయి. అయినప్పటికీ
ప్రతికూల పరిస్థితులను అధికమించి భారత
వ్యవసాయక విప్లవోద్యమ నిర్మాణం పట్ల అచెంచల విశ్వాసంతో కమ్యూనిస్టు విప్లవకారులు ముందుకు సాగుతారు.కాగా దేశంలో పాలక వర్గంగా మతోన్మాద తిరోగమన, జాతీయ దురహంకారఫాసిస్టు, కార్పొరేట్ దోపిడీ వర్గాల బిజెపిపాలన కొనసాగుతున్నది. ఈ తరహా ఫాసిస్టుపాలనను కార్మికవర్గ నాయకత్వంలో దీర్ఘకాల లక్ష్యంతో ఏర్పాటుచేసిన సమరశీలస్థిరమైన ప్రజా ఉద్యమం ద్వారా మాత్రమేఎదుర్కోగలం. కానీ మరో బడా బుర్జువాపార్టీతో ఎన్నికల ప్రంట్ల కట్టి, ఈ మహత్తరకర్తవ్యాన్ని ఎన్నికల పోరాటంగా మార్చి,ఈ ఫాసిస్టు పాలనను తాత్కాలికంగానిలువరించగలమేమో కాని, తుడిచిపెట్టలేమనే అంశాన్ని గమనించాలి.అంతిమంగా, ఈ దేశంలో అర్థ వలస, అర్ధఫ్యూడల్ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా వ్యవసాయక విప్లవోద్యమనిర్మాణానికి ప్రజలను సిద్ధంచేసి జనతాప్రజాతంత్ర విప్లవ కర్తవ్యాలను పరిపూర్తిచేయాలి. ఇందుకు గాను ప్రజలను” భూమి – ప్రజాస్వామ్యం – స్వాతంత్య్రం “నినాదాన్ని కేంద్రంగా చేసుకొని నిజమైనవిప్లవకారుల, విప్లవప్రజాతంత్ర శక్తులనుఐక్యం చేసి విప్లవోద్యమ నిర్మాణానికిపునరంకితం కావడమే, దొడ్డి కోమరయ్య కు అర్పించే విప్లవ నివాళి. వారే కొమరయ్య అమరత్వానికి నిజమైన వారసులు.

గోలి.కృష్ణ. ~ 944179645

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *