ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లకు సన్మానం

0

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లకు సన్మానం

గజ్వేల్, ఆర్ పీ న్యూస్:

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంట్స్ డే సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నేతి శ్రీనివాస్,యువజన విభాగం అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ ఆధ్వర్యంలో డాక్టర్లకు, చార్టెడ్ అకౌంట్స్ కు శాలువాతో సత్కరించి మెమోంటో అందజేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి,కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, నంగునూరి సత్యనారాయణ,డాక్టర్ మల్లయ్య,డాక్టర్ లింగం మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సభ్యులను అభినందించారు, తల్లి తండ్రులు,గురువులు, డాక్టర్లు మనకు కనిపించే దేవుళ్ళు అని వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అందరూ డాక్టర్లను ఒకే చోట ఆత్మీయ సత్కారం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్లు
అలాగే చార్టెడ్ అకౌంట్స్ వారు మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు ,ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *