దేశవ్యాప్తంగా డి జె యు
జాతీయ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఎన్నిక – రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి
గుంటూరు, ఆర్ పి న్యూస్ :
గుంటూరు జిల్లా ప్రజా ఫోకస్ డెమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం స్థానికంగా ఉన్న సమావేశ మందిరంలో జరిగింది. గత చేదు అనుభవాలను పరిశీలిస్తూ నూతన కార్యవర్గాన్ని జాతీయ కోఆర్డినేటర్ లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో రాష్ట్ర ఏపీ అడ్వైజర్ డి ఆర్ ఆర్ రావు స్వీయ పర్యవేక్షణలో ఈ సమావేశం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ డెమొక్రటిక్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆవిర్భవించడానికి కారణాలు తెలియపరిచారు. ఆల్ ఇండియా లెవెల్ లో విస్తరింపజేస్తున్న డెమొక్రటిక్ జర్నలిస్టు యూనియన్ ఇప్పటికే పలు జిల్లాలలో పాత్రికేయులకు శిక్షణ తరగతులు వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మరింత బలోపేతానికి రాష్ట్రం నలుమూలల సభ్యత్వాలు త్వరలో చేపడతామని ఆయన తెలియజేశారు. పలు మార్పులు చేపడుతూ రాష్ట్ర కార్యవర్గంలో నూతన పాత్రికేయులకి అవకాశము ఇవ్వబడిందని ఆయన తెలియజేశారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షులుగా కర్నూలు జిల్లా పాత్రికేయులు ఈశ్వర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా పి వి వి చంద్రశేఖర్ గాజువాక ట్రెజరర్ గా విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాగల రాజేష్ ఏపీ అడ్వైజర్ గా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన డి ఆర్ ఆర్ రావు మరియు శ్రీరామ్ మూర్తి ఈసీ మెంబర్లుగా గాజువాక నియోజకవర్గానికి చెందిన సారా జ్యోతి ధాలి రాజు సూర్యనారాయణ సహాయక అధ్యక్షురాలుగా జీవీఎల్ పద్మ మరియు రేణుక పట్నాయక్ సహాయక అధ్యక్షుడిగా రాజారావు ఆర్గనైజర్ గా పి యాగంటి కర్నూలు జిల్లాకు చెందిన ఉప అధ్యక్షులుగా చందర్రావు బాధ్యతలు చేపట్టారని రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి తెలియజేశారు. అతిత్వరలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ కార్యవర్గం కూడా ఎన్నిక కాబడుతుందని ఆల్ ఇండియా లెవెల్లో చేస్తున్న ఈ కార్యక్రమానికి పాత్రికేయులు సహకరించి మునుముందు డీజేయు కార్యవర్గం చేయబోయే సేవ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు.