మోహన్ బాబు మీడియా పై దాడిని ఖండిస్తున్నాం:కొమ్ము గణేష్
మీడియా మీద దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం
డి ఎం జె యు కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొమ్ము గణేష్
కరీంనగర్, ఆర్ పి న్యూస్ :
హైదరాబాద్ లో ఆదివారం మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ తండ్రీ కొడుకుల మధ్య జరిగిన కుటుంబ ఆస్తుల వ్యవహారలో జరిగిన గొడవను అక్కడకు ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ వార్త కవరేజ్ చేయడానికి వెళ్లిన నేపధ్యంలో వారిపై మంచు మోహన్ బాబు వారి వ్యక్తిగత సిబ్బంది ఆ టీవీ రిపోర్టర్ పై దాడి చేయడాన్ని, డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొమ్ము గణేష్, మరియు వారి కార్యవర్గం ఖండిస్తూ, వారు మాట్లాడుతూ ఎక్కడైనా మీడియా ప్రతినిధుల మీద మీడియా మీద దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక ప్రకటనలో తెలియజేశారు.