గజ్వేల్ రైతు వేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు
గజ్వేల్ రైతు వేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు
రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి – మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్
గజ్వేల్, ఆర్ పి న్యూస్:
సిద్దిపేట జిల్లా గజ్వేల్ రైతు వేదిక వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అద్యక్షుడు మోహన్నగారి రాజు,మాట్లాడుతూ రెండవ విడత 1,50,000 రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా గజ్వేల్ రైతు వేదిక వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకోవడం జరిగిందని రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర పుటల్లో నిలిచిపోతారని, ఎన్నికల హామీ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని కాంగ్రెస్ పార్టీ చేతల ప్రభుత్వమని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుంటుకు శ్రీనివాస్, జంగం రమేష్ గౌడ్, నంగునూరి సత్యనారాయణ, కొండల్ రెడ్డి, రాజు, షరీఫ్, రాజా గౌడ్, జానీ పాషా, గాడి పల్లి శ్రీనివాస్, మోహన్, శేఖర్, గాజుల శ్రీనివాస్, కన్నా యాదవ్, నక్క రేగొండ, కాంగ్రెస్ కార్యకర్తలు , రైతులు తదితరులు పాల్గొన్నారు.