కాంగ్రెస్ కు ప్రజల్లో మంచి ఆదరణ – మోహన్నగారి రాజు
కాంగ్రెస్ కు ప్రజల్లో మంచి ఆదరణ – మోహన్నగారి రాజు
కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మొహన్నగారి రాజు అన్నారు ఆదివారం గజ్వేల్ పట్టణంలో మోహన్నగారి రాజు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆదేశాల మేరకు గజ్వేల్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగిందని,కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి,ప్రతిపక్ష పార్టీల జీర్ణించుకోవడం లేదని, కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షుని స్థానంలో నా పేరు కాకుండా ఇతరుల పేర్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండిస్తున్నామని దయచేసి మళ్లీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లకుండా అందరూ సహకరించాలని అదేవిధంగా మేమంతా నర్సారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలిపారు,
ఈ కార్యక్రమంలో గజ్వేల్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు నాగరాజు నేత, సిద్దిపేట జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రెటరీ ఫారూఖ్ జానీ, తీగుల్ గ్రామ యువ నాయకుడు, ఉప్పల ప్రవీణ్, ప్రేమ్ కుమార్, కరుణాకర్ ,కప్ప భాస్కర్, సతీష్, నాగరాజు, లివన్ రెడ్డి, టిల్లు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు