ప్రతిఘటనోద్యమ దళపతి లింగన్న ఆశయాలకై పోరాడుదాం

0

ప్రతిఘటనోద్యమ దళపతి కామ్రేడ్ లింగన్న ఆశయాలకై పోరాడుదాం

సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ

భువనగిరి /పోచంపల్లి:

ప్రతిఘటన పోరాట వీరుడు, గిరిజనుల గుండెకాయ, సీపీఐ(ఎమ్-ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత కామ్రేడ్ పూణెం లింగన్న 5వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి-భువనగిరి జిల్లా పోచంపల్లి పట్టణంలో లింగన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు

ఈసందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పగడాల శివ మాట్లాడుతూ  కామ్రేడ్ లింగన్న విప్లవోద్యమంలో అలుపెరుగని పోరాటాలు నిర్వహించి, పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించాడని వారన్నారు.కామ్రేడ్ లింగన్న కూడు, గూడు ,నీడ లేని పేదలని ఐక్యం చేసి, భూమి లేని పేదలకు భూమి పంచాడని, ఎన్నో గ్రామాల నిర్మాణం చేశాడని, ఆ క్రమంలోనే దోపిడిదారులు పెట్టుబడిదారులపై పోరాటం నేర్పాడని మోసం చేస్తున్న వ్యాపారస్తులని సమన్వయంతో కూర్చోబెట్టి మాట్లాడాడని ఆయన అన్నారు. పార్టీ నిబంధనలకు కట్టుబడి నిర్మాణం చేసి ప్రజలని ప్రతిఘటన పోరాటం వైపు మళ్ళించాడని చండ్ర పుల్లారెడ్డి వారసత్వంతో ఆయన పోరాటం చేశాడని వారు అన్నారు. లింగన్నను పట్టుకొని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నప్పటికీ చిత్రహింసల గురిచేసి కాల్చి చంపారని దానికి కారణం కన్జ సంపదపై కన్వేషణ కార్పొరేట్ శక్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యం ఒకటే ఈ బూటకపు ఎన్కౌంటర్ చేశారని వారు అన్నారు. ఏ ఆశయం కోసం లింగన్న అమరుడయ్యాడో, వాటి సాధన కోసం పోరాడాలని,అప్పుడే వారికి నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో పి నరసింహ పి లక్ష్మీనారాయణ వీరేంద్ర వకీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *