ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించిన సీఎం

0

సీఎం ను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు

15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఆర్ పీ న్యూస్ :

గత 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించారు. అంతేకాకుకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు.

హైదరాబాద్  లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అప్‌గ్రెడేషన్ సమస్యను పరిష్కరించడంతో పాటు పదోన్నతులు కల్పించినందుకు ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డితో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *