మూసీ ప్రక్షాళనతో విశ్వనగరానికి మరింత శోభ:సీఎం రేవంత్ రెడ్డి

0

మూసీ ప్రక్షాళనతో విశ్వనగరానికి మరింత శోభ
హైడ్రా ద్వారా సమస్యల సత్వర పరిష్కారం
గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి

హైదరాబాద్, ఆర్ పీ న్యూస్:

మురికికూపంగా మారిన మూసీని సుందరీకరణ చేయడంతో పాటు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు విపత్తుల నిర్వహణకు హైడ్రా (HYDRAA) అనే సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

గోపన్‌పల్లిలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఉమెన్ బైకర్స్‌ను అనుమతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ ఫ్లైఓవర్ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు.

హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందుకోసం త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 5౦ వేల కోట్లతో పనులకు శ్రీకారం చుడతామని వివరించారు. రానున్న ఐదేళ్లలో ప్రపంచ నలుమూలలు పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూసీని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *