ఈ ప్రభుత్వంను చీల్చి చెండాడుతాం : సీఎం కెసిఆర్
ఈ ప్రభుత్వంను చీల్చి చెండాడుతాం : సీఎం కెసిఆర్
హైదరాబాద్, ఆర్ పీ న్యూస్:
తెలంగాణ అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేదలు, రైతుల బడ్జెట్ కాదని మాజీ సీఎం కెసిఆర్ వ్యాఖ్యనించారు.కొత్త ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇవ్వాలని మేము పెద్దగా ప్రశ్నించలేదు.. కానీ ఈ 6 నెలల్లో ప్రభుత్వం, రాష్టానికి సంబంధించి ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ చేయలేదని మాజీ సీఎం కెసిఆర్ మండిపడ్డారు.
మహిళలకు ఇస్తానన్న రుణాలు ఎప్పటి నుండో ఉన్న పథకమే అని, వీళ్లు ఇప్పుడు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.మేము వ్యవసాయ స్థిరీకరణ కోసం రెండు పంటలకు రైతుబంధు ఇస్తే వీళ్ల అవగాహనలేమి వల్ల దానిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని ఏద్దేవా చేశారు.ఇండస్ట్రియల్ పాలసీ ఏమి లేదు, దాని గురించి స్టోరీ టెల్లింగ్‌లా ఉంది తప్ప బడ్జెట్‌లా ఎది లేదు.వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, పేద వర్గాల మీద పాలసీ అనేది ఏమిటి అని ఏ ఒక్క అంశం లేదు. బడ్జెట్అ సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ మాట్లాడారు. ఈ బడ్జెట్‌పై భవిష్యత్తులో ప్రభుత్వాన్ని చీల్చి చెండడుతాం అని కెసిఆర్ హెచ్చరించారు.