ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు,ఇద్దరు జవాన్ లు మృతి
ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్ లు మృతి
అబూజ్ మడ్ /దంతేవాడ/ కాంకేర్, ఆర్ పీ న్యూస్ :
పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఎనమిది మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి.ఈ ఘటన చత్తీస్గడ్ లోని అబూజ్ మడ్ లో చోటుచేసుకుంది. చత్తీస్గడ్ అడవుల్లో మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య గత రెండు రోజులుగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. నారాయణ పూర్, కొండాగావ్, దంతేవాడా, కాంకేర్ కు చెందిన బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. హెలికప్టర్ ల ద్వారా కేంద్ర బలగాలు అక్కడికి చేరుకుంటున్నాయి. కాల్పులు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఈ ఏడాది లో ఇప్పటి వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 100 కు పైగా మావోయిస్టు లు మృతి చెందారు. దీంతో మావోయిస్టులు ప్రతీకారం తో రగిలి పోతున్నారు. ఎప్పుడు ఎలాంటి ఘటన జరుగుతుందో అని ఆదివాసీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.