ఖమ్మం పల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల కు అండగా ప్రతాప్ రెడ్డి

0

ఖమ్మం పల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల కు అండగా ప్రతాప్ రెడ్డి

డబల్ బెడ్ రూం అర్హులకు అండగా ఉంటాం –

గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి

గజ్వేల్, ఆర్ పీ న్యూస్ :
కొండపాక మండలంలోని ఖమ్మం పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను బుదవారం నిరుపేద 19 కుటుంబాల సభ్యులను కాళీ చేయించిన అధికారులు ఇండ్లకు తాళాలు వేసి సీజ్ చేసిన ఘటన ఖమ్మం పల్లి గ్రామంలో జరిగింది. విషయం తెలుసుకున్న గజ్వేల్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గురువారం ఖమ్మం పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఇండ్లను పరిశీలించారు, అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ వారి బాధలను విన్నారు. లబ్ధిదారులకు ధైర్యాన్ని చెప్పడం జరిగింది,
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ
గతంలోని కెసిఆర్ ప్రభుత్వం ఖమ్మం పల్లి గ్రామంలో 60 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి దాదాపు 41 ఇండ్లను నిరుపేద వారికి కేటాయించడం జరిగిందన్నారు, ఎన్నికలు సమీపించిన క్రమంలో ఎన్నికల కోడ్ రావడంతో మిగిలిన 19 ఇండ్లను కూడా లబ్ధిదారులను ఆ ఇండ్లకు పంపించడం జరిగిందన్నారు, 19 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఉన్న వారు నిరుపేదలు అన్నారు వారికి ఎలాంటి ఆస్తుపాస్తులు కూడా లేవన్నారు అందులో ఒకరి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు, నిన్న అధికారులు చేసిన పరాకాష్ట చర్యలకు కొండాపురం పద్మ అనే మహిళ సొమ్మసిల్లిఅక్కడే పడిపోయింది అన్నారు, ఇప్పటికైనా కలెక్టర్ , ఆర్డీవో, మానవతా దృక్పథంతో ఆలోచించి, వారికి ఇండ్లకు వేసి ఇలా తాళాలను తీసి లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించి పట్టాలను అందించాలన్నారు, లబ్ధిదారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసాని ఇచ్చారు, లబ్ధిదారులకు పట్టాలు లభించే వరకు వారి తరఫున పోరాటం చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *