రాష్ట్రాన్ని సాధించడమే మాకు అతిపెద్ద గౌరవం:కేటీఆర్
రాష్ట్రాన్ని సాధించడమే మాకు అతిపెద్ద గౌరవం : కేటీఆర్
హైదరాబాద్, ఆర్ పీ న్యూస్ :
లోక్ సభ ఎన్నికల ఫలితాల పైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చవిచూసామని అన్నారు.
అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు,ఎదుర్కొన్నామని,తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మాకు అతి పెద్ద గౌరవం అని చెప్పారు.
ఒక ప్రాంతీయ పార్టీగా వరుసగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని,
2014లో 63 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 2018లో 88 స్థానాలతో రెండవసారి ప్రభుత్వాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశాం అని తెలిపారు.
ప్రస్తుతం శాసనసభలో 39 సీట్లతో 1/3 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నామని, ఈరోజు వచ్చిన ఎన్నికల ఫలితాలు కచ్చితంగా నిరాశను కలిగించాయని ఆవేదన వెళ్ళగాకారు.
అయినా ఎప్పటిలాగే మరింత కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్న విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు.