బీజేపీ తోనే అభివృద్ధి సాధ్యం : జశ్వంత్ రెడ్డి
మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ గెలుపు
– గజ్వేల్ లో బీజేపీ శ్రేణుల సంబరాలు
– బీజేపీ తోనే అభివృద్ధి సాధ్యం : జశ్వంత్ రెడ్డి
గజ్వేల్, ఆర్ పీ న్యూస్ :
రాబోయే కాలంలో బీజేపీ మరింత బలపడుతుందని బీజేపీ సీనియర్ నాయకులు జశ్వంత్ రెడ్డి అన్నారు. మెదక్ ఎంపీ గా రఘునందన్ రావు గెలుపు తో సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సంబరాలు జరుపుకున్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న బీజేపీకి పట్టం కట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా గజ్వేల్ నియోజక వర్గం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాబోయే కాలంలో బీజేపీ మరింత బలపడుతుందని బీజేపీ తోనే అభివృద్ధి సాధ్యం అని అన్నారు.