అయ్యప్ప దేవాలయం లో ఘనంగా శ్రావణ మాసం పూజలు 

0

అయ్యప్ప దేవాలయం లో ఘనంగా శ్రావణ మాసం పూజలు 

అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం 

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప దేవాలయం లో శ్రావణ మాసం పూజలు కొనసాగుతున్నాయి శుక్రవారం 26 వ రోజుకు చేరుకున్న శ్రావణమాసం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీనియర్ నాయకులు బొగ్గుల సురేష్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని , హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, ఎక్కడా లేనివిధంగా గజ్వేల్ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రావణమాసం నెల రోజులు అయ్యప్ప స్వామికి దంపతుల ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని ఈ విశేష కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయం చైర్మన్ ఎర్రం శ్రీనివాస్,రవీందర్, నారాయణ రెడ్డి,లక్ష్మారెడ్డి, కూరగాయల రాంబాబు,ఉమేష్,ఆంజనేయులు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *