హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పై మృతురాలి బంధువుల దాడి
హయత్ నగర్ లో వివాహిత ఆత్మహత్య
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని మృతురాలి భందువుల ఆరోపణ
నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని పోలిస్ స్టేషన్ ముందు ధర్నా
పోలీస్ స్టేషన్ పై మృతురాలి బంధువుల దాడి
విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్/రంగారెడ్డి :
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారా కాలనీలో దివ్య అనే వివాహిత మృతి ఆందోళనకు దారితీసింది. ఆమె బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. భర్త శివ, అత్తఇంటివారు హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌పై మృతురాలి బందువులు దాడి చేశారు.పోలీసుల అదుపులో ఉన్న నిందితుడుని మృతురాలి బంధువులు చిత్తకబాదారు. ఈ ఘటనలో జోక్యం చేసుకున్న పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి. హయత్ నగర్ లోని విజయవాడ జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.