ఆంధ్రుల కల సాకారం : కృష్ణవేణి రెడ్డి
ఆంధ్రుల కల సాకారం : కృష్ణవేణి
హైదరాబాద్, ఆర్ పీ న్యూస్ :
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి భారీ మెజారిటీ రావటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు టీడీపీ తెలంగాణ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి అన్నారు. ఈమేరకు దిల్ సుఖ్ నగర్ లో ఆమె మాట్లాడిన ఓ వీడియోను విడుదల చేశారు. 5 కోట్ల ఆంధ్రుల కల నెరవేరింది అని తెలిపారు. కులాలకు అతీతంగా చంద్రబాబు పని చేస్తారని, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేలా టికెట్లు ఇచ్చారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తెలుగు దేశం పార్టీ పుట్టిందని,చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అంతమైందని, కూటమిని గెలిపుంచిన ప్రజలకు పెరపేరునా ధన్యవాదములు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథం లోకి తీసుకెళ్తారని చెప్పారు.