కేంద్ర హొం మంత్రి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి
కేంద్ర హొం మంత్రి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి
ట్యాంక్ బండ్ అంబేద్కర్ వద్ద ధర్నా
హైదరాబాద్, ఆర్ పి న్యూస్ :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.అర్.అంబేద్కర్ ను అవమానపర్చిన కేంద్ర హొం మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని ఎస్సీ ఎస్టీ బిసి ముస్లిం ఫ్రంట్ డిమాండ్ చెసింది.శనివారంనాడు హైదరాబాదు ట్యాంక్ బండ్ అంబేద్కర్ సర్కిల్ లో పార్లమెంటు లో అంబేద్కర్ పై అమిత్ షా వాఖ్యాలను నిరసిస్తూ ఎస్సీ ఎస్టీ బిసి ముస్లిం ఫ్రంట్ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.కేంద్ర మంత్రి పదవి నుండి అమిత్ షాను తొలగించాలని డిమాండ్ చెశారు., క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.అంబేద్కర్ మా దేవుడని.మా దిక్చూచి హక్కుల సూర్యడని కొనియాడారు.భారత రాజ్యాంగాన్ని,ప్రజస్వామ్యాన్ని బిజెపి ఖుని చెస్తుందన్నారు.బజెపి విద్వేషా రాజకీయాలను ఓడించాలన్నారు. ఈ ధర్నాలో వివిధ సంఘాల నాయకులు సలావుల్లాఖాన్,ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్,డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్,బెడబుడగ జంగం సంఘం నాయకులు రాం బాబు, అణగారిన కులాల హక్కుల సంఘం నాయకులు సి.ఎల్,యాదగిరి,నర్సింగరావు, ముస్లిం మైనారిటీ లు పెద్ద యెత్తున పాల్గొన్నారు.