ఆధునిక సమాజంలో కూడా స్త్రీలపై వివక్షత,అసమానతలు కొనసాగడం పాలకులు సిగ్గుపడాలి : ఆర్.సీత
ఆధునిక సమాజంలో కూడా స్త్రీలపై వివక్షత,అసమానతలు కొనసాగడం పాలకులు సిగ్గుపడాలి
– పీ ఓ డబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.సీత..
ఆధునిక సమాజంలో కూడా స్త్రీలపై నేటికీ అనేక విధాలుగా దాడులు,హింసలు, అఘాత్యాలు,అత్యాచారాలుఅసమానతలు,హత్యలు జరగడం పాలకులు సిగ్గుపడాలని,పురుషాధిక్య ఆధిపత్య సమాజంలో స్త్రీలు నిత్యం అనేక అవమాలకు,అన్యాయాలకు గురికావలసిందేనని,వీటి నుండి బయటపడాలంటే స్త్రీలు ప్రస్తుత వ్యవస్థ లొసుగులను, అసమానతలను,దోపిడీ విధానాలను,చట్టాల పేరుతో ఆ చట్టాలను ఎలా బలహీనపరుస్తున్నారో అర్థం చేసుకొని సమరశీల,సంఘటిత మహిళా ఐక్య ఉద్యమాలను నిర్మించాలని అందుకు మహిళలు ముందుకు రావాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.సీత పిలుపునిచ్చారు.
సోమవారం ఆలేరు సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ కార్యాలయంలో పిఓడబ్ల్యూ జిల్లా ఏడవ మహాసభ పి ఓ డబ్ల్యు జిల్లా నాయకులు పద్మ శశిరేఖ తమ్ముడి మాధవి కొంగర ప్రమీల అధ్యక్షతన జరిగింది.*
ఈ సందర్భంగా మహిళా ఉద్యమంలో అమరులైన వారికి రెండు నిమిషాలు సంతాప సూచకంగా మౌనం పాటించి జోహార్లు అర్పించడం జరిగింది.
ఈ అనంతరం సీత మాట్లాడుతూ ఇంటికి దీపం ఇల్లాలు, మా ఇంటి మహాలక్ష్మి, ఆడ పిల్లలు ఉన్న ఇల్లు కలకలలాడుతుందని చెప్పడం వట్టి భ్రమ అని, ఇది మహిళలను ఈ పేర్లతో మోసగించడమే అవుతుందని, ప్రస్తుతం మహిళల పరిస్థితిని చూస్తే అర్థమవుతుందని అన్నారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళా లోకంపై జరుగుతున్న వివక్షత అసమానతలు, అత్యాచారాలను, ప్రస్తుతం ఉనికిలో ఉన్న మహిళా చట్టాలు ఏమి చేయలేకపోతున్నాయని, ఈ చట్టాలు ఉన్నవాడికి, పలుకుబడి అధికార బలం ఉన్న దౌర్జన్యకారులకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని దానికి ఉదాహరణ మహిళలపై బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులు, మణిపూర్ లో ఆదివాసీలపై వివస్త్రలను చేసి ఊరేగించి అత్యాచారాలు చేసి హత్యలు చేయడమే నిదర్శనమని అన్నారు.బలమైన మహిళా పోరాటాలను తీవ్రతరం చేసినప్పుడే ఇలాంటి దాడులను ఎదుర్కొంటామని అందుకు ప్రగతిశీల మహిళా సంఘం నిరంతరం మహిళల ఐక్యత కోసం వారి రక్షణ కోసం, అంతిమంగా సమానత్వ సమాజం కోసం మహిళా జనోదరణ కోసం పిఓడబ్ల్యూ పోరాడుతుందని అన్నారు.మహాసభకు ముందు పిఓడబ్ల్యూ జెండాను కాచారం మాజీ ఎంపీటీసీ ఏనుగుల నరసమ్మ ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా నాయకులు తమ్మడి ఉమా, బర్మ సుజాత,గడ్డం పద్మ, చిరబోయిన లక్ష్మి, ఏనుగుల బాలమని, పాకాల సరిత, బేజాడి వినోద, కొమ్మిడి లత తదితరులు పాల్గొన్నారు.