ఏజెన్సీ ప్రాంత వర్కింగ్  జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

0

ఏజెన్సీ ప్రాంత వర్కింగ్  జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మండల అధ్యక్షులు ఎస్. కె. సల్మాన్

ములుగు /కొత్తగూడ,ఆర్ పి న్యూస్:

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను నెరవేర్చాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కొత్తగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కు వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐజేయు కొత్తగూడ మండల అధ్యక్షులు సల్మాన్ పాషా మాట్లాడుతూ ప్రజలకు మరియు ప్రభుత్వానికి వివిధ సమస్యలపై వారధిగా ఉంటూ ఎన్నో కష్టనష్టాలను వచ్చి నిష్పక్షపాతంగా మా కర్తవ్యాలను నిర్వర్తిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఏజెన్సీ ప్రాంతంలో సొంత ఇల్లు లేక అనేక కష్టనష్టాలను ఓర్చి జీవనం కొనసాగిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తున్నాం అని, ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో మేము ఆశించిన స్థాయిలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, పైగా అవమానాలు చీత్కారాలు మాకు మిగిలాయి. ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రభుత్వంలోనైనా మాకు తగు న్యాయం చేస్తారని ,ప్రస్తుత పాలక పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని ప్రధానంగా ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నూతన హెల్త్ కార్డుల మంజూరు వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ కళాశాల మరియు పాఠశాలలో ఉచిత విద్యా అవకాశాలు కల్పించే విధంగా మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో జర్నలిస్టులపై జరిగే దాడులను అరికట్టేందుకు జర్నలిస్టులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా నాయకులు పాలడుగు శ్రీధర్, శెట్టి పరశురాములు, మండల ఉపాధ్యక్షులు గోగు విజయకుమార్, ప్రచార కార్యదర్శిలు తీగల ప్రేమ్ సాగర్, ఉబ్బని శ్రీహరి,గంగిశెట్టి రాకేష్ వర్మ, ఈక నరేష్, కోశాధికారి బైరబోయిన అశోక్, శ్యామ్, దేవేందర్, లక్ష్మీనరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *