రైతులకు అవగాహన సదస్సు
వానకాలం విత్తనాల ఎంపిక మరియు విత్తనాల కొనుగోలులో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులకు అవగాహన సదస్సు
ఎల్లారెడ్డి, ఆర్ పీ న్యూస్ :
కళ్యాణి గ్రామ రైతులకు అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజా గౌడ్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ ఉన్న డీలర్ ద్వారానే విత్తనాలు కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది ప్రైవేట్ కంపెనీ వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి విత్తనాలు అమ్మితే తీసుకోకూడదని చెప్పడం జరిగింది రైతులు విత్తనాలు కొన్నప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలని చెప్పడం జరిగింది విత్తనాలు కొనే ముందు వ్యవసాయ అధికారి కానీ శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు