విద్యా పరిరక్షణ కై మరో ఉద్యమం
నాడు స్వరాష్ట్రం కోసం పోరాటం
నేడు విద్యా పరిరక్షణ కై మరో ఉద్యమం
పలు గ్రామాలను సందర్శించిన సూర్యాపేట సామజిక అధ్యయన వేదిక
సూర్యాపేట, ఆర్ పీ న్యూస్ :
ఉద్యమాల గడ్డ సూర్యాపేట మరో ఉద్యమానికి తెరలేపింది. స్వరాష్ట్ర సాధనకోసం అలుపెరుగని పోరు సలిపిన సూర్యాపేట ప్రభుత్వ విద్యను పరిరక్షించాలంటూ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలపడుద్ది అని ప్రజలు అనుకున్నారు కానీ అందుకు భిన్నంగా కార్పొరేట్ విద్యా సంస్థలు మరింత బలపడ్డాయి. మూతబడిన ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించాలని, మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు రామలింగపురం, బద్యతండ,మంగలి(బొజ్య )తండ గ్రామాలను వేదిక సభ్యులు సందర్శించి ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్బంగా వేదిక సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పరిరక్షించేందుకు విశేషంగా కృషి చేస్తున్నామని, కార్పొరేట్ విద్యా సంస్థల్లో పేద, మధ్య తరగతి ప్రజలు చదువును కొనుక్కోలేరని, అందుకే ప్రభుత్వ విద్యా వ్యవస్థ ను పరిరక్షించాల్సిన గురుతరబాధ్యత ప్రభుత్వం పైనే ఉందని స్పష్టం చేశారు.