రైతుల తరపున బీజేపీ పోరాడుతుంది : బీజేపీ నాయకులు గురువా రెడ్డి
- రైతుల తరపున బీజేపీ పోరాడుతుంది : బీజేపీ నాయకులు గురువా రెడ్డి
గజ్వేల్, ఆర్ పీ న్యూస్:
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు దారం గురువారెడ్డి మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గం మరియు సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వం ల్యాండ్ ఆక్వేషన్ కి సంబంధించి బిఆర్ఎస్ ప్రభుత్వం వర్గల్ ఏరియాలో 1800 ఎకరాలు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్ కోసం రైతుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది కానీ అప్పుడు ఇండస్ట్రియల్స్ నిర్మాణ దశలోనే ప్రస్తుత డిసిసి అధ్యక్షుడు తూంకుంట నరసారెడ్డి గారు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసి కట్టడాలను ఆపేశారు. అలాగే సిద్దిపేట కలెక్టరేట్ కు సంబంధించి రైతుల వద్ద భూములు అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బలవంతంగా రైతుల నుండి తీసుకొని వాళ్లకు తగిన నష్టపరిహారం ఇవ్వకుండా ఇప్పుడు పోలీసులను పెట్టి కంచెలు వేస్తున్నారు వర్గల్ లో మాత్రం ఇండస్ట్రియల్ పార్క్ కింద బీఆర్ఎస్ గవర్నమెంట్ 18 వందల ఎకరాలు తీసుకోవడం జరిగింది. 2018 లో నర్సారెడ్డి గారు కాంగ్రెస్ లో చేరిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ పేరు మీద కేసు వేసి అక్కడ ఈ రకమైన కట్టడాలు నిర్మించొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది కానీ అప్పుడు రైతుల పక్షాన ఉన్న నర్సారెడ్డి గారు ఇప్పుడు కార్పొరేట్ల పక్షాన ఉన్నారు అలాగే గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నర్సారెడ్డి అనుచరుడు సాజిద్ అనే వ్యక్తి రింగ్రోడ్లో 20 గుంటల స్థలాన్ని ప్రభుత్వం తీసుకుంది దానికి గాను అప్పటి కలెక్టర్ వెంకట్రాంరెడ్డి ఒక ఎకరా స్థలాన్ని సాజిద్ కు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. అక్కడ ముట్రాజ్ పల్లి రైతుల నుంచి బలవంతంగా గుంజుకున్న వెంకటరామిరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా సాజిద్ బేగ్ అనే వ్యక్తికి ఎకరం వ్యవసాయ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నర్సరెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి సిద్దిపేట కలెక్టరేట్ భవన సముదాయం పరిధిలో అప్పటి ప్రభుత్వం రైతుల వద్ద నుంచి వ్యవసాయ భూములు లాక్కుంది లాక్కుంటే వారు కోర్టులో కేసులు వేసి ఇప్పటికి కొనసాగుతున్నాయి కానీ మళ్ళీ అధికారులు పోలీసులు పంపించి కంచే వేస్తున్నారు ఈరోజు సిద్దిపేట కలెక్టరేట్ ముందు కూడా రైతులు ధర్నా చేయడం జరిగింది. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రజల పక్షాన ఉండి పోరాడుతామని చెప్పిన నాయకులు ఈరోజు కార్పొరేట్ కంపెనీల కు దాసోహమై రైతులను ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఆనాడు నర్సారెడ్డి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి విరోధులు కానీ నేడు వారిద్దరే బ్రోకర్లుగా మారి రైతుల స్థలాలు చుట్టూ కంచెలు ఏర్పాటు చేస్తున్నాడు ఇది ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గం లో జరుగుతున్న భూమాయ ప్రజా ప్రతినిధిగా ఉన్న డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డికి ఇవన్నీ కనిపించడం లేదా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుడిక్యాల రాములు,మనోహర్, మన్నే శేఖర్,తదితరులు పాల్గొన్నారు.