జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్యపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలి 

0

జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్యపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలి

 

హన్మకొండ, తెలంగాణ సేన న్యూస్ :

 

ఇటీవల చతిస్గడ్ రాష్ట్రంలో జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ ను అక్కడి బడా కాంట్రాక్టర్లు హత్య చేయించారని వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు.

హనుమకొండ అంబేద్కర్ సెంటర్లో ముఖేష్ చంద్రకర్ హత్యపై ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలియజేశారు అరగంట సేపు జరిగిన ఈ కార్యక్రమంలో చతిస్గడ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు .

తెలంగాణ ప్రజా ఫ్రంట్ వరంగల్ ఉమ్మడి జిల్లా బాధ్యులు జనగాం కుమారస్వామి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖేష్ చంద్రకర్ జర్నలిస్టుగా అబూజ్ మడ్ ప్రాంతంలో ఆదివాసీ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను హక్కులను సాటి ప్రపంచానికి తెలియజేశారని అక్కడి ఖనిజ సంపదను , బడా కార్పొరేట్ సంస్థలు చేసే దోపిడీని అలాగే ఆదివాసి ళిత మైనారిటీ ప్రజలపై జరిగిన దాడులను తన కలం ద్వారా బయటి సమాజానికి తెలియజేశారని వారు అన్నారు. ఇటీవల చత్తీస్ గడ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం కోసం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, కేటాయించిన నిధులలో జరిగిన 120 కోట్ల రూపాయల అవినీతిని బయటపెట్టినందుకే కాంట్రాక్టర్లు ముఖేష్ చంద్రకర్ ను హత్య చేయించారని వారు ఆరోపించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల హక్కుల కోసం నిలబడి పనిచేస్తున్న అనేకమంది జర్నలిస్టులను హత్యలు చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ హత్యకు చత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని హత్యపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు చైతన్య మహిళా సంఘం కన్వీనర్ జే కళ భారత్ బచావో నాయకులు, గోపు సోమయ్య పౌర హక్కుల సంఘం నాయకులు జయంత్ , పిడిఎం నుండి క్రాంతి తెలంగాణ రైతాంగ సమితి నుండి వడ్డేపల్లి రాజేందర్ మానవ హక్కుల వేదిక నుండి పొన్నాల రమేష్ రాజ్ మహమ్మద్ యాకన్న వెంకన్న మహమూద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *