బిజెపిని ఆదరించిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు
బిజెపిని ఆదరించిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు
బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి, ఆర్ పీ న్యూస్ : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హల్ లో ఆదివారం బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ బిజెపిని ఆదరించి ఎక్కువ మెజారిటీ ఇచ్చినందుకు ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో మండల అధ్యక్షులు బూత్ అధ్యక్షులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారని దాని ద్వారానే ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బిజెపి మెజార్టీ సాధించిందని అన్నారు. ఎల్లారెడ్డి ప్రజలకు ప్రత్యేకంగా రుణపడి ఉంటామని వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా ఇలాగే బిజెపి పార్టీని బలోపేతం చేసి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నర్సింహులు,మాజీ ఎంపిపి నాగిరెడ్డి పెట్ రాజ్ దాస్ ,మండల అధ్యక్షుడు నర్సింహులు, పట్టణ అధ్యక్షుడు సతీష్, అల్లం పండరీ, గణేష్, బలరాజ్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.