ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ — సయ్యద్ బాబా
ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ — సయ్యద్ బాబా
లబ్ధిదారులకు 500 కే గ్యాస్ సిలిండర్
సిద్దిపేట, ఆర్ పి న్యూస్ :
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలలో భాగంగా ప్రతి ఇంటికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలవుతుందని , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ సేవాదళ్ అధ్యక్షులు సయ్యద్ బాబా, కప్ప భాస్కర్ అన్నారు. శనివారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రెండో వార్డులో సబ్సిడీ గ్యాస్ సర్టిఫికెట్ లబ్ధిదారులకు అందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో గజ్వేల్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.