అసమానతలు ఇంకా ఉన్నాయి: మంత్రి సీతక్క

0

– అసమానతలు ఇంకా ఉన్నాయి 

– అభివృద్ధి ఫలాలు పేదలకు చేరటం లేదు

– పేదరికం నిర్ములనకు కాంగ్రెస్  ప్రభుత్వం కృషి 

– మా ప్రభుత్వానికి చేయూతనివ్వండి

అంతర్జాతీయ సంస్థ బ్రాక్ (BRAC) ప్రతినిధులతో సచివాలయంలో సమావేశమైన మంత్రి సీతక్క

హైదరాబాద్, ఆర్ పి న్యూస్:

అంతర్జాతీయ సంస్థ బ్రాక్ (BRAC) ప్రతినిధులతో సచివాలయంలో  మంత్రి సీతక్క సమావేశం అయ్యారు.

బ్రాక్ సంస్థ పలు దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం పని చేస్తున్నది.మారు మూల ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి రంగాల్లో బ్రాక్ పని చేస్తుంది.తెలంగాణ ప్రభుత్వం తో కలిసి పనిచేసేందుకు  బ్రాక్ సంసిద్దత వ్యక్తం చేసింది. తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ప్రజల స్థితిగతులను, అమలవుతున్న సంక్షేమ పథకాల తీరును క్షేత్రస్థాయిలో  బ్రాక్ అధ్యయనం చేసింది.వివరాలను మంత్రి  సీతక్క కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ప్రతినిధిలు వివరించారు.

ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అనుకున్న స్థాయిలో అభివృద్ధి ఫలాలు పేదలకు చేరటం లేదని,

మారిన పరిస్థితులు అవసరాల నేపథ్యంలో పేదలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు అని పేర్కొన్నారు.నిరుపేదల జీవితాల్లో మార్పు తీసుకురావడమే మా ప్రభుత్వ లక్ష్యం అని, పేదరికం నుంచి వచ్చిన తనకు పేదలతో పేగు బంధం ఉంది అని చెప్పారు.సమాజంలో ఇంకా అసమానతలు ఉన్నాయని,నిరుపేదలకు అట్టడుగు, వర్గ ప్రజలకు కనీస వసతులు ఉండటం లేదు అని పేర్కొన్నారు. బహు రూపాల్లో పేదరికం ఇంకా కొనసాగటం బాధాకరం, పేదరికన్ని రూపుమాపే దిశలో అంతా కలిసి పని చేయాలి అని అన్నారు.అందరము అంకితభావంతో పని చేస్తే పేదరికం అనేది ఉండదని, పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్   ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది అని,క్షేత్రస్థాయిలో పథకాలుఅమలవుతున్న తీరును మీ వంటి సంస్థలు అధ్యయనం చేయడం అభినందనీయమని కొనియాడారు.మాతో కలిసి పని చేసేందుకు మీరు ముందుకు రావడం సంతోషంగా ఉందని, పేదరిక నిర్మూలన కోసం మా ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో పాలుపంచుకోండి అని ఈ సందర్బంగా సంస్థ ప్రతినిధులను కోరారు.పేదలకు మెరుగైన విద్యా, వైద్యం, ఉపాధి కల్పన లో మా ప్రభుత్వానికి చేయూతనివ్వండి అని అన్నారు.బ్రాక్అ డ్వైజర్ శ్వేతా బెనర్జీతో పాటు పలువు ప్రతినిధులను  మంత్రి సీతక్క సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *