బీజేపీ బలోపేతానికి కృషి – సాయిరెడ్డి రాంరెడ్డి
బీజేపీ బలోపేతానికి కృషి – సాయిరెడ్డి రాంరెడ్డి
బీజేపీ పార్టీ మర్కుక్ మండల కార్యవర్గ సమావేశం
సిద్దిపేట, ఆర్ పి న్యూస్:
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశం సోమవారం మర్కుక్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి రాంరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు సింగం సత్తయ్య, కానుకంటి శ్రీనివాస్, సాయిరెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కృషి,చేయాలని అన్నారు ,నిరుపేదలకు అండగా బీజేపీ నిలుస్తుందని,కేంద్రంలో బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారం లోకి వచ్చిన తరవాత నరేంద్ర మోడీ సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పరిపాలన కొనసాగిస్తుందని, రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు మర్చిపోయింది అని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ జయకేతనం ఎగురవేయడం ఖాయం అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుడిక్యాల రాములు, రమేష్ గుప్త, రాజేందర్ సింగ్, తాడూరి మహేష్ గౌడ్, తిరుపతి రెడ్డి , పాండు సింగ్,మధు, మోర్సు కిషోర్ రెడ్డి,నర్సింలు, చంద్రం , బాలకృష్ణ,బీజీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.