రాష్ట్ర చిహ్నం, టీఎస్ లోగో మార్చడం సరికాదు: సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి
కెసిఆర్ ప్రకటించిన టీఎస్ లో ఉన్న అర్ధం టీజీ లో లేదు
– చార్మినార్, కాకతీయ తోరణం చారిత్రక కట్టడాలు
– రేవంత్ రెడ్డి నిర్ణయం సరికాదు
ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్
హైదరాబాద్, ఆర్ పీ న్యూస్ :
తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర లోగో మార్పుపై వివాదం రాజుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం అవుతుంది. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మార్పు చేయబోతున్నామనే సంకేతాలు ఇవ్వాలని సంకల్పంతో కొన్ని మార్పులు చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ మార్పుల వివాదం రాజుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం పూర్తయింది. అయితే సార్వత్రిక ఎన్నికల ముందే మాజీ సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం టీఎస్ లోగోను, రాష్ట్ర చిహ్నంను ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కొన్ని మార్పులను తీసుకొస్తామని చెప్పి టీఎస్ లోగోను టీజీగా మార్చారు.సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి టీఎస్ లోగో,రాష్ట్ర చిహ్నం మార్చడం ను తీవ్రంగా ఖండించారు. నాటి సీఎం కెసిఆర్ ప్రకటించిన టీ ఎస్ లోగో, రాష్ట్ర చిహ్నం అర్ధవంతంగా ఉన్నాయని అన్నారు.రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం అహంకారం కు నిదర్శనం అని పేర్కొన్నారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో ఆయన ఈ విషయాలపై స్పందించారు. టీ అంటే తెలంగాణ అని, ఎస్ అంటే స్టేట్ అని, తెలంగాణ స్టేట్ అనే అర్ధం వస్తుందని, టీ జి అంటే అర్ధం లేదని చెప్పారు.చార్మినార్ 400 సంవత్సరాలు గా చెక్కు చెదరలేదు అని, కాకతీయ తోరణం, చార్మినార్ కట్టడాలు చరిత్రలో నిలిచిపోయాయని, అలాంటి వాటిని తొలగించడం లో ఆంతర్యం ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.