బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆలయాల వద్ద ఏర్పాట్లు: కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మీ శ్రీనివాస్
బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆలయాల వద్ద ఏర్పాట్లు
– అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మీ శ్రీనివాస్
సికింద్రాబాద్, ఆర్ పీ న్యూస్:
బోనాల ఉత్సవాల నేపథ్యంలో అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మీ శ్రీనివాస్ గురువారం తుకారం గేట్ లోని వార్డు కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాలు జరిగే ఆలయాల వద్ద అన్నిరకాల ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా బోనాలను సమర్పించడానికి ఆలయాలకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలను తీసుకోవాలని ఆమె అధికారులకు తెలిపారు. ఆలయాల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు బోనాలు జరిగే ప్రాంతాల్లో సరిపడ మంచినీటిని సరఫరా చేయాలని ఆమె అన్నారు. ఆలయాల మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అధికారులు అన్నివేళలా అందుబాటులో ఉంటూ ఏర్పాట్లను ముమ్మరం చేయాలని ఆమె సూచించారు. ఈ సమావేశం జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్ సుభాష్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాని శ్రీనివాస్, ఏంఎంహెచ్ ఓ రజినీకాంత్, అన్నివిభాగాల అధికారులు పాల్గొన్నారు.