సేవకు ప్రతి రూపం లయన్స్ క్లబ్ – మున్సిపల్ చైర్మన్ రాజమౌళి
గజ్వెల్, ఆర్ పీ న్యూస్:
సేవకు ప్రతి రూపం లయన్స్ క్లబ్ అని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు గజ్వేల్ లో గురువారం సాయంత్రం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ,లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ,లయన్స్ క్లబ్ ఆఫ్ విస్డం,లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం సభ్యులకు అభినందనలు తెలిపారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవలను విస్తృత పరచాలని కోరారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రములు హాజరై నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.