నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ఆరుగురుపై కేసు నమోదు 

ఎల్లారెడ్డి, ఆర్ఎ పీ న్యూస్ల్ :

ఎల్లారెడ్డి  పట్టణంలోని పలు కిరాణా షాపుల్లో గుట్కాలు విక్రయిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు దాడులు చేసినట్లు ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం పట్టణంలోని పలు కిరాణా, పాన్ షాపులపై పోలీసు సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో 6648 రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు పలువురు పోలీస్ కానిస్టేబుళ్లు సంపత్, వీరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *